ఏరు ఉన్న మెంతి ఆకు ఫ్రై/Fenugreek Sprouts Fry/vibsk-47
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ఏరు ఉన్న మెంతి ఆకు | : | 5 – 6 కట్టలు |
2. | కొబ్బరి తురుము | : | 3 టేబుల్ స్పూనులు |
3. | ఉల్లిపాయలు | : | 1 పెద్దది (సన్నగా కట్ చేసు కో వలెను) |
4. | పచ్చి మిర్చి | : | 3 – 4 (సన్నగా కట్ చేసు కో వలెను) |
5. | చిన్న ఉల్లి | : | 3 – 4 (సన్నగా కట్ చేసు కో వలెను) |
6. | కారం పొడి | : | ½ టేబుల్ స్పూను |
7. | పసుపు | : | ½ టేబుల్ స్పూను |
8. | ఉప్పు | : | తగినంత |
9. | నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారుచేయు విధానము:
- మెంతి ఆకులు నుండి ఏరులు తుంచి వేరుగా తీసి వేయవలెను. మెంతి ఆకు ను సన్నగా తరిగి వేరుగా పెట్టవలెను.
- ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసి, తరిగిన చిన్న ఉల్లి, మరియు పచ్చి మిర్చి వేసి వేగించవలెను.
- చిన్న ఉల్లి లేత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఉల్లి పాయలు ముక్కలు వేసి వేగించి వలెను.
- ఉల్లి పాయ ముక్కలు మెత్తగా ఐన తర్వాత, పసుపు, కారం పొడి వేసి బాగా కలపవలెను.
- ఇప్పుడు తరిగిన మెంతి ఆకు వేసి బాగా కలప వలెను. ఎక్కువ మంట లో ఒక 2 నిముషములు వండవలెను.
- మంట తగ్గించి తరిగిన కొబ్బరి తురుము వేసి బాగా కలపవేలను.
- ఉప్పు వేసి బాగా కలప వలెను. 2 -3 నిముషములు ఎక్కువ మంట లో వండవలెను.
- ఉడికిన మెంతి ఫ్రై మంట నుండి తీసి వేరే గిన్నె లోకి తీసుకోవలెను.
చపాతీ / పరాఠా తో తినవచ్చును.
Watch Video Here: