మిగిలి పోయిన ఖిచడి లతో పూరి /Leftover Khichadi Puri/vibsk-32
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | మిగిలి పోయిన దలియా ఖిచడి/
లేక ఏదైనా మిగిలిన ఖిచడి |
: | 1 కప్ |
2. | మెంతి ఆకు | : | 1 కప్ (సన్నగా తరగవలెను) |
3. | పచ్చి మిర్చి | : | 2 – 3 (కట్ చేసుకో వలెను) |
4. | కాసిన నెయ్యి | : | 2 టేబుల్ స్పూనులు |
5. | కారం పొడి | : | 1 టేబుల్ స్పూను |
6. | పసుపు | : | 1 టేబుల్ స్పూను |
7. | ధనియా పొడి | : | 1 టేబుల్ స్పూను |
8. | వాము | : | ½ టేబుల్ స్పూను |
9. | గోధుమ పిండి | : | 200 గ్రాములు |
10. | నూనె | : | డీప్ ఫ్రై చేయుటకు |
తయారు చేయు విధానము:
- పూరి తయారు చేయుటకు మిగిలి పోయిన (దలియా ఖిచడి లేక వేరే ఏదైనా ఖిచడి) ఖిచడి లో మెంతి కూర ఆకు, పచ్చి మిరిచి, కారం పొడి, ఉప్పు, పసుపు, దనియపొడి, వాము మరియు కాసిన నెయ్యి వేసి బాగా కలపవలెను.
- ఇప్పు డు దీనిలో గోధుమ పిండి వేసి బాగా కలిపి ముద్దగా చేయవలెను.
- రొట్టె చేసే కర్రకు, చేసే ప్రదేశమునకు కొద్దిగా నూనె రాయ వలెను. గోధుమ పిండి ముద్దను చిన్న, చిన్న బంతులుగా చేసుకో వలెను.
- రొట్టెల కర్రతో వతి చిన్న పూరీలుగా 8 – 10 చేసి పక్కన పెట్ట వలెను.
- ఒక భాoడిలో నూనె వేసి వేడి చేయవలెను.
- పూరి ల ను నూనె లోవేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయ వలెను.
పూరిలను చట్నీ / పికెల్ / టీ తో తిన వచ్చును.
Watch video here: