ముఖాన ఖీర్ – ఉపవాసం ఉన్నప్పుడు /Fox Nut Pudding For Fasting/vibsk-40
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ముఖాన (ఫాక్స్ నట్స్) | : | 1 కప్ |
2. | పాలు | : | 1 లీటర్ |
3. | పంచదార | : | తగినంత |
4. | బాదం | : | 15 – 20 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను) |
5. | పిస్తా | : | 20 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను) |
6. | జీడిపప్పు | : | 15 – 20 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను) |
7. | కాసిన నెయ్యి | : | 2 టేబుల్ స్పూనులు |
తయారు చేయు విధానము:
- కాసిన నెయ్యి ను లోతుగా ఉన్న గిన్నె లో వేసి మంటా ను మీడియం లో పెట్టవలెను.
- మఖాన వేసి వేగించి వలెను. ఎక్కవుగా వేగించ రాదు.
- మఖాన వేగిన తర్వాత, పాలు పోయవలెను.
- మంటా తగ్గించి, పాలు దగ్గర అయ్యేంత వరకు వేగించ వలెను.
- పాలు కాగుతున్నప్పుడు గిన్నె చుట్టూ పాలు చిక్కదనం అంటుకొనుము. వాటిని తీసి పాలలో వేసి బాగా కలపవలెను.
- ఇప్పుడు జీడీ పప్పు, బాదం ముక్కలు వేయవలెను. పాలు ఇంకా చిక్కనగును.
- పాలు బాగా తగ్గినపుడు, పంచదార వేసి కలపవలెను. ఒక 5 నిముషములు ఉంచి గిన్నెను మంట నుండి తీసి వేయ వలెను.
- మఖాన పాయసం తయారై రెడీ గ ఉన్నది, దీనిని ఉపవాసం ఉన్నప్పుడు తీసు కో వలెను.
- పిస్తా ముక్కలు వేసి గార్నిష్ చేసుకో వలెను.
పాయసం (ఖీర్) వేడి లేక చల్కగ తీసి కో వచ్చును. రెండు విధములలో చాలా రుచి కరముగా ఉండును.
Watch video here: